News September 9, 2025

సీఎం, మంత్రులు సినిమాల్లో నటించవచ్చు: హైకోర్టు

image

AP: సీఎంతో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ CM, సినీ నటుడు NTR విషయంలోనే అప్పట్లో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో Dy,CM పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ మాజీ IAS విజయ్ కుమార్ పిటిషన్ వేయగా జస్టిస్ వెంకట జ్యోతి ఈ విధంగా తీర్పునిచ్చారు. ఈ నెల 15కు విచారణ వాయిదా వేశారు.

Similar News

News September 9, 2025

ఫ్యాట్ ఫోబియా గురించి తెలుసా?

image

చాలామంది లావుగా ఉండటం వల్ల అందంగా లేమని కుంగిపోతుంటారు. దీన్నే ఫ్యాట్‌ ఫోబియా అంటారు. ఇది శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధికబరువు వల్ల ఎందులోనూ సక్సెస్‌ కాలేమని, ఇతరులతో పోల్చితే తాము తెలివితేటల్లోనూ తక్కువేనని బాధపడతారు. ఫొటోలు, అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడరు. ఇలా కాకుండా తమను తాము ప్రేమించుకోవడం నేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

News September 9, 2025

వల్వర్ పెయిన్ ఎందుకొస్తుందంటే?

image

నార్మల్ డెలివరీ తర్వాత చాలామందికి యోని దగ్గర నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్, కారణం లేకుండా నొప్పి వస్తుంటే దాన్ని వల్వర్ పెయిన్ అంటారు. ప్రసవ భయం, ఒత్తిడి వల్ల ఈ నొప్పి రావొచ్చు. సరైన చికిత్స తీసుకోకపోతే ఇది దీర్ఘకాలం ఉంటుంది. గైనకాలజిస్ట్‌ని కలిస్తే వెజైనల్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేస్తారు. అది నెగటివ్ వస్తే పెల్విక్ ఫ్లోర్ మజిల్ వ్యాయామాలు సూచిస్తారు. ఇలా నొప్పిగా ఉంటే సబ్బులు, వెజైనల్ వాష్‌లు వాడకూడదు.

News September 9, 2025

జేడ్ రోలర్‌తో మెరిసే చర్మం

image

అలసిన ముఖానికి సాంత్వన కలిగించే అద్భుతమైన పరికరం జేడ్ రోలర్. దీన్ని వాడే ముందు ముఖాన్ని శుభ్రం చేసి రోజ్‌వాటర్‌ అద్దాలి. తర్వాత జేడ్ రోలర్‌తో సవ్య, అపసవ్య దిశల్లో మసాజ్ చేయాలి. రోజుకి మూడుసార్లు మసాజ్ చేస్తే చర్మంపై లింఫాటిక్ ఫ్లూయిడ్ విడుదల తగ్గుతుంది. మసాజ్ చేయడంవల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ జరిగి, ఆక్సిజన్ అంది చర్మం కాంతివంతం అవుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గి, చర్మం తాజాగా ఉంటుంది.