News December 19, 2024
100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. స్థలం మంజూరుకు సీఎం ఓకే

TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు టీడీపీ నేత టీడీ జనార్దన్ తెలిపారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలందరికీ ఇష్టమైన నటుడు, నాయకుడని సీఎం తెలిపారు. కాగా విగ్రహంతో పాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జనార్దన్ వివరించారు.
Similar News
News November 27, 2025
ఇతిహాసాలు క్విజ్ – 79 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: శివ భక్తులైన మూడు జీవులు శివుడి కోసం తమ ప్రాణాలను అర్పించి మోక్షం పొందాయి. అవే.. శ్రీ (సాలెపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). ఈ 3 జీవులు శివుడిని అత్యంత భక్తితో పూజించి, స్వామి అనుగ్రహం పొంది అక్కడే లీనమయ్యాయి. వీటి పేర్ల కలయికతోనే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 27, 2025
సర్పంచ్ ఎన్నికలు.. Te-Poll యాప్తో ఈజీగా..

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం Te-Poll అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పౌరులు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని SEC తెలిపింది. అలాగే ఫిర్యాదులను సులభంగా అప్లోడ్ చేసి, వాటిని ట్రాక్ చేయవచ్చని పేర్కొంది.
Share It
News November 27, 2025
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.


