News March 1, 2025
ఇసుక సరఫరాపై సీఎం ఆదేశాలు

TG: ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఖనిజాభివృద్ధి శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే పనులకు TGMDC నుంచే ఇసుక సరఫరా చేయాలన్నారు. పెద్దమొత్తంలో చేపట్టే నిర్మాణ రంగాలకు వీటి నుంచి సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వమే సరైన ధరలకు సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.
Similar News
News March 1, 2025
సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న రంభ

సీనియర్ హీరోయిన్ రంభ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ప్రకటించారు. ‘సినిమానే నా ఫస్ట్ లవ్. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు, ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నా’ అని తెలిపారు. 90ల్లో హీరోయిన్‌గా, ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్‌లో నటించిన ఆమె 2010లో ఇంద్రకుమార్ అనే వ్యాపారిని వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు.
News March 1, 2025
గర్భిణులు, వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దు: APSDMA

APలో 3 నెలలపాటు ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని <
News March 1, 2025
యూట్యూబ్ రూమర్లను నా భార్యకు పంపుతున్నారు: అనిల్ రావిపూడి

యూట్యూబ్‌లో వ్యూస్ కోసం రూమర్లు క్రియేట్ చేసే వారిపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు. మీనాక్షి చౌదరితో తనకు కెమిస్ట్రీ బాగుంటుందని యూట్యూబ్‌లో ఈ మధ్య రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. ఆ రోతను సన్నిహితులు తన భార్యకు పంపి ఇదేంటని అడుగుతున్నట్లు చెప్పారు. లేనివి సృష్టించి తాత్కాలికంగా లాభపడ్డా, అవి జీవితాలను ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోవాలన్నారు.