News August 20, 2025
పేదలకు ఇళ్లు.. స్థలాలు గుర్తించాలని సీఎం ఆదేశాలు

AP: వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. గృహ నిర్మాణ శాఖ సంబంధిత అంశాలపై సచివాలయంలో సమీక్షించారు. మరో 3 నెలల్లో 3 లక్షల ఇళ్లు, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తి కావాలని ఆదేశించారు. పట్టణ పేదలకు 2 సెంట్లు, గ్రామీణ పేదలకు 3 సెంట్లు భూమి కేటాయిస్తామన్న హామీ మేరకు అవసరమైన స్థలాలను గుర్తించాలని సూచించారు.
Similar News
News March 28, 2026
యుద్ధ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం: మోదీ

పశ్చిమాసియాలో యుద్ధంతో అనేక దేశాల్లో ఆహారం, ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని PM మోదీ తెలిపారు. ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పౌరులంతా ఐక్యంగా, ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. భయాందోళనలు రేకిత్తించే తప్పుడు ప్రచారాలు చేయొద్దని పార్టీలకు హితవు పలికారు. నోయిడా(UP)లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తొలి దశను ఆయన ప్రారంభించారు.
News March 28, 2026
గంభీర్ ఫొటోలు వాడొద్దు: హైకోర్టు

టీమ్‌ఇండియా కోచ్ గంభీర్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఫొటో, వాయిస్‌తో రూపొందించిన ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్‌ను 36 గంటల్లోగా తొలగించాలని ఇన్‌స్టా, గూగుల్ సహా ఇతర SM ప్లాట్‌ఫామ్స్‌ను ఆదేశించింది. ఈ కంటెంట్‌ను క్రియేట్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. అనుమతి లేకుండా వీడియోలు చేయడం వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
News March 28, 2026
TN ఎన్నికల బరిలో నటుడు సుందర్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్టర్, నటుడు సుందర్ తొలిసారి పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పుతియ నీతి కట్చి(న్యూ జస్టిస్ పార్టీ) అభ్యర్థిగా మధురై సెంట్రల్ నుంచి బరిలో దిగనున్నారు. తన భర్తకు సపోర్ట్ చేయాలని బీజేపీ నేత, నటి ఖుష్బూ అభిమానులు, స్నేహితులను కోరారు. 30 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు సేవ చేయడమే సుందర్ లక్ష్యమని తెలిపారు.
<<-se>>#ELECTIONS2026<<>>


