News September 20, 2025

‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం

image

AP: పల్నాడు జిల్లా మాచర్లలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్త ఊడ్చారు. వారితో కాసేపు మాట్లాడారు. స్వచ్ఛరథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.2కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని మార్గదర్శి-బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశం కానున్నారు.

Similar News

News January 17, 2026

కామారెడ్డి: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

image

కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. శనివారం ఐడీఓసీలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా వీటిని ఖరారు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా రిజర్వేషన్లు కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. దీంతో ఆయా వార్డుల్లో ఎన్నికల సందడి మొదలైంది.

News January 17, 2026

పొగమంచు తీవ్రత.. ఉ.8 గంటల తర్వాతే బయటికి రావాలి!

image

AP: రాష్ట్రంలో రేపు ఉ.8 గంటల వరకు పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, తూ.గో, ప.గో జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వెల్లడించింది. పండగకొచ్చి వాహనాల్లో తిరుగు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పూర్తిగా పొగమంచు తొలగిపోయాకే బయటికి రావాలంది. అటు TGలోనూ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు వల్ల వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.

News January 17, 2026

U-19WC: భారత్ స్కోర్ ఎంతంటే?

image

U-19 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టులో కెప్టెన్ ఆయుష్ మాత్రే(6) మరోసారి ఫెయిల్ అయ్యారు. మరో ఓపెనర్ సూర్యవంశీ 72, అభిజ్ఞాన్ కుందు 80 రన్స్‌తో రాణించారు. మధ్యలో వర్షం వల్ల కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచును 49 ఓవర్లకు కుదించారు. మరి భారత్ ఈ టార్గెట్‌ను కాపాడుకుంటుందా? COMMENT