News October 31, 2024

ఇందిరాగాంధీ, పటేల్‌కు CM నివాళులు

image

TG: ఈరోజు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ ఉప ప్రధాని వల్లభభాయ్ పటేల్‌ జయంతి కావడంతో సీఎం రేవంత్ వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.

Similar News

News February 8, 2026

సెట్‌లో తాగుబోతును చితకబాదా: సాయి ధన్సిక

image

తాను నటించిన ‘యోగిడా’ మూవీ సెట్‌లో ఓ వ్యక్తిని చితకబాదినట్లు హీరోయిన్ సాయి ధన్సిక తెలిపారు. ‘కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఫొటో దిగేందుకు వచ్చాడు. అతడు తాగి ఉండటంతో ఫొటో ఇచ్చేందుకు నా అంకుల్ ఒప్పుకోలేదు. దీంతో అంకుల్‌ని కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అది చూసి కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని చితకబాదా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరో విశాల్‌తో ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగింది.

News February 8, 2026

ఫిబ్రవరి 8: చరిత్రలో ఈరోజు

image

✒ 1897: మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జననం(ఫొటోలో) ✒ 1902: సుప్రసిద్ధ కవి ఆండ్ర శేషగిరిరావు జననం ✒ 1934: ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వర రావు జననం ✒ 1941: గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం ✒ 1957: నటి వై.విజయ జననం ✒ 1963: IND మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జననం

News February 8, 2026

చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

image

యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా T20IWCలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా నిలిచింది. 2024 నుంచి ఇప్పటివరకు వరుసగా 9 మ్యాచులు గెలిచింది. దీంతో సౌతాఫ్రికా(2024లో 8విజయాలు)ను దాటేసింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా(8wins) ఉంది. అటు WCలో వన్డే, టీ20ల్లో కలిపి ఓవరాల్‌గా టీమ్ ఇండియా 100 విజయాలు పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా(108) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో టీమ్ కావడం గమనార్హం.