News November 23, 2024
CM పోస్ట్: మెట్టు దిగని షిండే, బెట్టు వీడని బీజేపీ
మహారాష్ట్ర ఫలితాలపై దాదాపు క్లారిటీ రాగా CM పదవిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకే తిరిగి పదవి ఇవ్వాలని శివసేన (శిండే) డిమాండ్ చేస్తోంది. 55 స్థానాలు (2019తో పోలిస్తే 14 సీట్లు+) గెలిచిన తమ పార్టీ ప్రభుత్వంలో కింగ్ మేకర్ అని శివసైనికులు అంటున్నారు. అయితే ప్రస్తుత డిప్యూటీ సీఎం ఫడణవీస్ తదుపరి రాష్ట్ర నేతగా ఉంటారని 126 సీట్ల లీడ్‌లోని BJP (2019లో 105) చెబుతోంది.
Similar News
News November 23, 2024
56లక్షల ఫాలోవర్లున్న నటుడు.. వచ్చిన ఓట్లు 146
సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచేస్తామనుకోవడం భ్రమేనని మరోసారి రుజువైంది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్‌కు ఇన్‌స్టాలో 56లక్షల ఫాలోవర్లు ఉన్నారు. బయటా ఫ్యాన్‌బేస్ ఉంది. ఆయన మహారాష్ట్రలోని వెర్సోవాలో ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేశారు. 20 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయనకు కేవలం 146 ఓట్లే వచ్చాయి. విచిత్రంగా నోటాకు ఇక్కడ 874 ఓట్లు పడ్డాయి.
News November 23, 2024
‘కంగువా’ ఎఫెక్ట్.. నిర్మాతను ఆదుకోనున్న సూర్య?
రూ.350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ నెల 14న రిలీజైన ఈ చిత్రం ఇప్పటికీ రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించలేదు. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజాకు సాయం చేసేందుకు హీరో సూర్య ముందుకొచ్చినట్లు సమాచారం. చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ స్టూడియో గ్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఓ చిన్న మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. నామమాత్రపు రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటారని టాక్.
News November 23, 2024
ఓటర్ల పరిణతి: నచ్చిన కూటమికి మెచ్చిన తీర్పు
పాలకులను ఎన్నుకోవడంలో ప్రజలు అత్యంత పరిణతి ప్రదర్శిస్తున్నారు. ఊగిసలాట, గందరగోళం, హంగ్ పరిస్థితికి అస్సలు తావివ్వడం లేదు. గెలిపించాలనుకున్న వారికే ఓట్లేస్తున్నారు. కోరుకున్న కూటమికే అధికారం అప్పగిస్తున్నారు. నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ భారీ మెజారిటీ అందిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో మహాయుతికి 220, ఝార్ఖండ్‌లో JMM+కు 55, మొన్న హరియాణాలో BJPకి 48, జమ్మూకశ్మీర్లో NCకి 42 సీట్లు ఇవ్వడమే ఉదాహరణ.