News June 4, 2024
అనకాపల్లిలో సీఎం రమేశ్ ముందంజ

AP: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు పోటీలో ఉన్నారు. 1వ రౌండ్లో సీఎం రమేశ్‌కు 4,278 ఓట్లు పోలవ్వగా.. బూడి ముత్యాలనాయుడుకి 3,289 ఓట్లు పడ్డాయి. సీఎం రమేశ్ 989 మెజార్టీలో ఉన్నారు.
Similar News
News September 7, 2025
ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత: బొత్స

AP: యూరియా కొరతపై ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతుల ఇబ్బందులు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతి వల్లే ఈ సమస్య వచ్చిందని ఫైరయ్యారు. అటు ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, నెట్వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదని ఆరోపించారు.
News September 7, 2025
తెలుగు అబ్బాయికి రూ.5 కోట్ల ప్యాకేజీ!

AP: అనంతపురం (D) గుంతకల్లుకు చెందిన సాయి సాకేత్ అమెరికాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో భారీ వేతనంతో ఉద్యోగం సాధించారు. తొలుత 10 వారాల పాటు ఇంటర్న్‌షిప్ కోసం రూ.కోటి ఆఫర్ చేసినట్లు అతడి పేరెంట్స్ రమేశ్, వాసవి తెలిపారు. అది పూర్తయ్యాక పెర్ఫార్మెన్స్ను బట్టి ఏడాదికి రూ.5 కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని చెప్పారు. వీరు పదేళ్ల క్రితం USకు వెళ్లి సెటిల్ అయ్యారు. సాకేత్ ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ చదువుతున్నారు.
News September 7, 2025
నవరో కామెంట్స్ ఫేక్: ‘X’ FACT CHECK

‘భారత్ తమ లాభాల కోసం రష్యా ఆయిల్ కొంటోంది’ అన్న US ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవరో వ్యాఖ్యలను ‘X’ ఖండించింది. ‘ఇంధన భద్రత కోసమే భారత్ రష్యా ఆయిల్ కొంటోంది. ఎలాంటి ఆంక్షలు ఉల్లంఘించట్లేదు. రష్యా నుంచి యురేనియం కొంటున్న US.. భారత్‌ని టార్గెట్ చేయడం ద్వంద్వ వైఖరే’ అని పేర్కొంది. దీంతో నవరో ‘X’ అధినేత ఎలాన్ మస్క్‌పై మండిపడ్డారు. వారి ఫ్యాక్ట్ చెక్ ఓ చెత్త అని కొట్టి పారేశారు.