News March 23, 2024
బీజేపీకి వెన్నుపోటు పొడిచిన సీఎం రమేశ్: YCP

AP: చంద్రబాబు శిష్యుడు సీఎం రమేశ్ బీజేపీకి వెన్నుపోటు పొడిచాడంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ‘టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికై ఆ తర్వాత బాబు సలహాతో సీఎం రమేశ్ బీజేపీలోకి వెళ్లారు. గతేడాది కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీ పేరుతో రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చారు. బాబు సలహా మేరకు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ఆర్థిక సాయం చేశారు’ అంటూ బాండ్ల వివరాలను జత చేసింది.
Similar News
News October 27, 2025
విటమిన్ Cతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ C ఒకటి. ముఖ్యంగా స్త్రీలకు ఇది ఎంతో ముఖ్యం అంటున్నారు నిపుణులు. విటమిన్ సి తగ్గితే స్త్రీలకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. C విటమిన్‌తో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. గర్భిణులు తీసుకుంటే శిశువులో లోపాలు రాకుండా ఉంటాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల హార్మోన్ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఉండవు.
News October 27, 2025
ఎవరికి ఎంత విటమిన్ C కావాలంటే?

మహిళలు విటమిన్ C ఉండే ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. మహిళలకు రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ C అవసరం అవుతుంది. గర్భిణులకు 85 mg, బాలింతలకు 120 mg అవసరమని నిపుణులు చెబుతున్నారు. టమాటా, కివీ, క్యాబేజీ, నారింజ, నిమ్మ, ఉసిరి, క్యాప్సికం, అరటి పండ్లు, బెర్రీలు, పైనాపిల్, జామ, బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ, పచ్చి బటానీలు, మ్యాంగో ద్వారా విటమిన్ Cని పొందొచ్చని సూచిస్తున్నారు.
News October 27, 2025
వారి ఓట్లు తొలగిస్తాం: CEC

SIR రెండో దశ రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు CEC జ్ఞానేశ్ ప్రకటించారు. Goa, గుజరాత్, కేరళ, MP, రాజస్థాన్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, UP, WB, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికలు, ఉపఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓటర్ లిస్ట్‌ను సీజ్ చేస్తామని తెలిపారు. మరణించిన, వలస వెళ్లిన, ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్న ఓట్లను తొలగిస్తామన్నారు.


