News January 26, 2025

ఢిల్లీలో ఏటికొప్పాక బొమ్మల శకటం.. స్పందించిన సీఎం

image

AP: ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రదర్శించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘ప్రధాని మోదీతో సహా ప్రముఖులందరినీ ఈ శకటం ఆకట్టుకుంది. పర్యావరణహితమైన, సహజసిద్ధమైన వనరులతో చేసే మన ఏటికొప్పాక బొమ్మలు కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి. శకటంలో భాగస్వాములను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

Similar News

News October 16, 2025

‘మిత్ర మండలి’ రివ్యూ&రేటింగ్

image

తండ్రి కులాంతర పెళ్లికి ఒప్పుకోడని హీరోయిన్ (నిహారిక) ఇంటి నుంచి పారిపోవడం, దీంతో ఆమె ఫ్రెండ్స్ పడిన ఇబ్బందులే స్టోరీ. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణుల కామెడీ అక్కడక్కడా మినహా చాలాచోట్ల రుద్దినట్లు అనిపిస్తుంది. సత్య యాక్టింగ్ రిలీఫ్ ఇస్తుంది. బ్రహ్మానందం ఓ పాటలో మెరిశారు. నవ్వించాలనే సెటప్ చేసుకున్నా డైరెక్టర్ విజయేందర్ సక్సెస్ కాలేదు. కథ, స్క్రీన్‌ప్లే, సాంగ్స్, BGM తేలిపోయాయి.
రేటింగ్: 1.75/5.

News October 16, 2025

లవకుశుల్లో ఎవరు పెద్దవారు?

image

లవకుశులు కవలలన్న విషయం మనకు తెలిసిందే. ఈ జంట పదాల్లో లవుడి పేరు ముందుండటం వల్ల లవుడు పెద్దవాడని అనుకుంటారు. కానీ అనేక పురాణాలు కుశుడు పెద్దవాడని చెబుతున్నాయి. కవలల్లో ముందు జన్మించిన వారిని పెద్దవారిగా పరిగణిస్తారు. రామాయణ గాథలు కుశుడే ముందు జన్మించినట్లు పేర్కొంటున్నాయి. దీన్ని బట్టి కుశుడు పెద్దవాడని చెప్పవచ్చు. అయితే కుశుడిని, వాల్మీకీ తన మాయా శక్తితో సృష్టించాడన్న కథనాలు కూడా ఉన్నాయి.

News October 16, 2025

పంచదారతో పసిడి చర్మం

image

అందంగా కనిపించాలని కోరుకోని వారుండరు. అలాగని రోజూ ఖరీదైన క్రీములు వాడి చర్మ సంరక్షణ చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారు ఇంట్లోనే సులువుగా దొరికే పంచదారతో చిటికెలో మెరిసిపోవచ్చు. * గులాబీ రేకుల్ని ముద్దగా చేసి, దానికి చెంచా చొప్పున తేనె, పంచదార కలిపి ముఖానికి పూత వేయండి. అలా ఓ నలభై నిమిషాలు ఆరనిచ్చి చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే ముఖం కాంతులీనుతుంది.