News October 12, 2024

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్

image

TG: రాష్ట్ర సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ రోజున కుటుంబ సభ్యులు ఒకచోట చేరి సంబురాలు చేసుకోవడం ఐక్యతకు నిదర్శమన్నారు. చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవిత సత్యాన్ని విజయ దశమి తెలియజేస్తుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News October 12, 2024

దసరా రోజున రావణుడికి పూజ.. ఎక్కడో తెలుసా?

image

సాధారణంగా అన్ని చోట్ల విజయ దశమి రోజున రావణుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు. యూపీలోని కాన్పూర్‌లో మాత్రం రావణుడిని పూజిస్తారు. ఇక్కడ దశకంఠుడికి ఆలయం ఉంది. దసరా రోజునే తెల్లవారుజామునే దీనిని తెరుస్తారు. వేలాది మంది భక్తులు గుడికి వచ్చి రావణుడిని పండితుడిగా భావించి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని సాయంత్రం కల్లా మూసివేస్తారు.

News October 12, 2024

ఉప్పల్‌లో క్లీన్ స్వీప్ చేస్తారా?

image

భారత్, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే రెండు టీ20లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా, క్లీన్ స్వీప్‌పై దృష్టి సారించింది. మరోవైపు ఒక్క మ్యాచులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని బంగ్లాదేశ్ ఆరాటపడుతోంది. మరి పండగ రోజు యువ భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

News October 12, 2024

టూత్ బ్రష్‌లపై బ్యాక్టీరియాలను చంపే వైరస్‌లు!

image

షవర్ హెడ్స్, టూత్ బ్రష్‌లో మునుపెన్నడూ చూడని కొత్త వైరస్‌లను అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 614 వైరస్‌లను కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆశ్చర్యకర విషయమేంటంటే అవేవీ మానవాళికి హాని కలిగించేవి కాదు. పైపెచ్చు ఇవి హానికర బ్యాక్టీరియాలను చంపుతాయని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ సూపర్ బగ్‌లకు వ్యతిరేకంగా చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ వైరస్‌లు దోహదపడతాయి.