News December 13, 2024

రైల్వే ప్రాజెక్టులపై కేంద్రానికి CM రేవంత్ విజ్ఞప్తులు

image

TG: కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పాల‌ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను CM రేవంత్ కోరారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, రైల్వే ప్రాజెక్టులపై ఢిల్లీలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. VKB-కృష్ణా, క‌ల్వ‌కుర్తి-మాచ‌ర్ల మ‌ధ్య నూత‌న రైలు మార్గం నిర్మించాల‌ని విజ్ఞప్తి చేశారు. డోర్న‌క‌ల్‌-మిర్యాల‌గూడ, డోర్న‌క‌ల్‌-గ‌ద్వాల రైలు మార్గాల‌ను పునఃప‌రిశీలించాల‌ని కోరారు.

Similar News

News December 18, 2025

ఆరోగ్యం, ఐశ్వర్యం తిరిగి పొందేందుకు..

image

అశాంతి, అనారోగ్యం, ఐశ్వర్య నష్టం మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే పరమేశ్వరుడిని ప్రసన్నం చేసే రుద్రహోమం మీకు సరైనది. ఇందులో శ్రీరుద్రం, శివ పంచాక్షరి వంటి మంత్రోచ్ఛారణలతో పాటు పరమేశ్వరుడికి ప్రీతికరమైన ఆహుతులను పూజారులు అగ్నికి సమర్పిస్తారు. దీంతో అనారోగ్యం, నెగెటివ్ ఎనర్జీ దూరమై శివుడి అనుగ్రహంతో అర్థ, అంగ బలం పొందుతారు. అందుబాటు ఛార్జీల్లో పూజ, వివరాల కోసం <>క్లిక్ చేయండి.<<>>

News December 18, 2025

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగాల కోత

image

అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. లక్సెంబర్గ్‌లోని యూరోపియన్ హెడ్‌క్వార్టర్స్‌లో 370 జాబ్స్‌కు కోత పెట్టనుంది. అక్కడ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం కంపెనీ చరిత్రలో తొలిసారి. AI వినియోగంపై దృష్టిపెట్టిన అమెజాన్ 14 వేలకు పైగా ఉద్యోగులను తొలగిస్తామని అక్టోబర్‌లో ప్రకటించింది. లక్సెంబర్గ్‌లో తొలుత 470 మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే స్టాఫ్‌తో చర్చల తర్వాత ఆ సంఖ్యను తగ్గించింది.

News December 18, 2025

చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు

image

AP: సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు వచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ‘మా కుటుంబానికి, ఏపీకి గర్వకారణమైన క్షణం. సీఎం చంద్రబాబును బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎకనమిక్ టైమ్స్ సంస్థ సత్కరించింది. భారతదేశ సంస్కరణల ప్రయాణాన్ని ఇంత స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో తీర్చిదిద్దిన నాయకులు కొందరే. ఈ అవార్డు ఆయన సంస్కరణలు, వేగం, పాలనపై నమ్మకానికి దక్కిన గౌరవం’ అని ట్వీట్ చేశారు.