News February 20, 2025

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఎన్నికల ప్రచారాల్లో రిజర్వేషన్లపై మాట్లాడిన కేసుల్లో ఆయన న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేసింది. కాగా గత ఎన్నికల సమయంలో రేవంత్ మాట్లాడిన స్పీచ్‌లపై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఇవాళ మూడు కేసులు విచారణకు వచ్చాయి.

Similar News

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. కారు యజమాని ఎవరంటే?

image

ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు i20 <<18253113>>కారు<<>>లో జరిగిందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కారు రిజిస్ట్రేషన్ నం. HR26 CE7674 కాగా హరియాణాలోని గురుగ్రామ్‌లో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. యజమాని మహ్మద్ సల్మాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. పుల్వామాకు చెందిన తారిక్ అనే వ్యక్తికి ఈ కారును అమ్మానని సల్మాన్ పోలీసులకు చెప్పాడని NDTV తెలిపింది. అయితే తారిక్ మరో వ్యక్తికి కారును అమ్మారా అనే విషయం తెలియాలి.

News November 11, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 11, మంగళవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.19 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 11, 2025

అమ్మోనియం నైట్రేట్ అంత డేంజరా?

image

ఢిల్లీ పేలుడులో <<18253212>>అమ్మోనియం<<>> నైట్రేట్ వాడినట్లు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని విరివిగా ఎరువుల్లో ఉపయోగిస్తారు. మండే స్వభావం ఎక్కువగా ఉండటంతో పేలుడు పదార్థాల్లో వాడుతారు. ఈ పేలుడు శక్తివంతమైనదని, చుట్టుపక్కల వస్తువులను క్షణాల్లోనే నాశనం చేయగలదని నిపుణులు చెబుతున్నారు. జనావాసాల్లో దీనిని పెద్ద ఎత్తున నిల్వ చేయడంపై నిషేధం ఉంది. తాజాగా హరియాణాలో వీటి నిల్వలను భారీగా గుర్తించారు.