News September 3, 2025

‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశానికి చీఫ్ గెస్ట్‌గా సీఎం రేవంత్

image

TG: CM రేవంత్ ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, గిరిజన నియోజకవర్గాలు, ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా 1000 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తోంది.

Similar News

News September 3, 2025

52 ఏళ్ల మహిళ 26 ఏళ్లుగా నమ్మించింది.. చివరకు!

image

UPలో 52 ఏళ్ల మహిళ 26 ఏళ్లుగా నమ్మించడంతో ప్రియుడు చంపేశాడు. ఫరూఖాబాద్‌కు చెందిన మహిళకు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మైన్‌పురికి చెందిన అరుణ్ కుమార్ ఆమెకు పరిచయమయ్యాడు. ఆమె ఫొటో ఫిల్టర్స్ వాడి 26 ఏళ్ల యువతిగా అతడిని నమ్మించింది. కొన్ని రోజులకు వీరిద్దరూ ఏకాంతంగా కలుసుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విసుగెత్తిపోయిన ఆ యువకుడు ఆమెను ఊపిరాడకుండా చేసి హతమార్చాడు.

News September 3, 2025

బీటెక్ అర్హతతో 1,534 పోస్టులు

image

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL)లో కాంట్రాక్టు ప్రాతిపదికన 1,534 పోస్టులకు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ ఇంజినీర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలున్నాయి. బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఈ/ఎంటెక్‌లో 55% మార్కులతో పాసైన, 29ఏళ్లలోపు వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి ₹23K నుంచి ₹1.20L వరకు జీతం ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://www.powergrid.in/<<>>

News September 3, 2025

10,277 ఉద్యోగాలు.. దరఖాస్తుల సవరణకు ఇవాళే లాస్ట్

image

ఐబీపీఎస్ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-CSA(xv) 10,277 క్లర్క్ పోస్టుల దరఖాస్తుల సవరణకు ఇవాళే చివరి తేదీ. అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు ఏవైనా వివరాలు తప్పుగా ఎంటర్ చేస్తే ఇవాళ రా.11.59లోపు మార్పులు చేసుకోవచ్చు. అభ్యర్థులకు అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో ప్రిలిమ్స్, నవంబర్ 29న మెయిన్స్ నిర్వహిస్తారు. కాగా ఈ ఉద్యోగాలకు గత నెల 28తో దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే.
వెబ్‌సైట్: <>https://ibpsreg.ibps.in/<<>>