News April 5, 2024

ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి వెళ్లారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను సీఎం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. హీరో వెంకటేశ్ సీఎం పక్కన కూర్చొని సందడి చేస్తున్నారు. సీఎం రేవంత్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.

Similar News

News February 14, 2026

కాళేశ్వరంలో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

image

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవార్లకు పూర్ణాభిషేకం నిర్వహించి, అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పాలపొరక, రక్షాబంధనం, దీక్షా వస్త్రధారణ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఋత్విక్ వర్ణన, మృత్సం గ్రహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. క్షేత్రమంతా భక్తుల శివనామ స్మరణతో మారుమోగుతోంది. ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News February 14, 2026

40 తర్వాత ఆహారంలో ఇవి చేర్చుకోండి

image

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ క‌చ్చితంగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. 40 ఏళ్ల‌కు పైబ‌డిన త‌రువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వ‌స్తి చెప్పి ఆహారంలో టమాటాలు, చిల‌గ‌డదుంప‌లు, కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, యాపిల్ పండ్లు, బాదం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అజీర్తి, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గుతాయి. కొలెస్ట్రాల్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ఉండి గుండెజబ్బులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

News February 14, 2026

IND vs PAK: హ్యాండ్ షేక్‌పై పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

image

T20 WCలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ‘హ్యాండ్‌ షేక్’ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. Asia Cupలో టీమ్ ఇండియా ప్లేయర్లు పాక్‌తో కరచాలనం చేయకపోవడం పెద్ద దుమారమే రేపింది. దాన్ని గుర్తు చేస్తూ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పటిలాగే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, నిర్ణయం భారత్ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.