News September 25, 2024

నేడు సీఎం రేవంత్ కేసు విచారణ

image

TG: రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో CM రేవంత్‌పై నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఇవాళ విచారించనుంది. రిజర్వేషన్లను తీసేసేందుకు BJP యత్నిస్తోందని గతంలో CM వ్యాఖ్యానించారు. BJP ప్రతిష్ఠకు భంగం కలిగేలా రేవంత్‌ మాట్లాడారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 499, 125 సెక్షన్ల కింద రేవంత్‌పై కేసు నమోదైంది.

Similar News

News November 22, 2025

దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలి: KTR

image

TG: ఈనెల 29న ‘దీక్షా దివస్’ను ఘనంగా నిర్వహించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పిలుపునిచ్చారు. “15 ఏళ్ల క్రితం, పార్టీ అధినేత KCRగారు ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. జిల్లా కేంద్రాల్లోని పార్టీ ఆఫీసుల్లోనే దీక్షా దివస్‌ను నిర్వహించుకోవాలి. కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా KCR భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలి” అని పార్టీ నేతలకు నిర్దేశం చేశారు.

News November 22, 2025

‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300 కోట్లు?

image

రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ బడ్జెట్ దాదాపు ₹1,300Cr ఉండొచ్చని నేషనల్ మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు రూపొందిన భారీ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఇది ఒకటని తెలిపింది. అయితే నితీశ్ తివారి-రణ్‌వీర్ కపూర్ ‘రామాయణం’, అట్లీ-అల్లు అర్జున్ ‘AA22xA6’ మూవీల బడ్జెట్(₹1500Cr-₹2000Cr రేంజ్‌) కంటే ఇది తక్కువేనని పేర్కొంది. కాగా బడ్జెట్‌పై వారణాసి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

News November 22, 2025

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఎల్లో అలర్ట్

image

AP: దక్షిణ అండమాన్ సముద్రం-మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 24న వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.