News December 19, 2024

మొగిలయ్య మృతి పట్ల CM రేవంత్ సంతాపం

image

TG: జానపద కళాకారుడు, ‘బలగం’ మూవీలో నటించిన మొగిలయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటన్నారు. మొగిలయ్య కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. మొగిలయ్య భౌతికంగా మన మధ్య లేకున్నా, పాట రూపంలో తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అటు మూవీ డైరెక్టర్ వేణు, నిర్మాత దిల్ రాజు కూడా సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News February 6, 2026

OFFICIAL: ఈనెల 11న OTTలోకి చిరు ‘MSVPG’

image

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ వచ్చేసింది. ఈనెల 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానున్నట్లు OTT ప్లాట్‌ఫామ్ ‘జీ5’ వెల్లడించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు.

News February 6, 2026

TGకి రూ.12 లక్షల కోట్లు ఇచ్చాం: ప్రహ్లాద్ జోషి

image

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన HYDలో మీడియాతో మాట్లాడారు. ‘మోదీ పాలనలో TGకి ₹12 లక్షల కోట్లు ఇచ్చాం. వ్యవసాయం, మౌలిక వసతులు, హైవేల నిర్మాణానికి ఎక్కువగా వెచ్చించాం. పన్నుల వాటాను 32 నుంచి 41%కి పెంచి ఇప్పటి వరకు ₹2.52 లక్షల కోట్లు ఇచ్చాం. UPA హయాంలో ₹60వేల కోట్లు కూడా ఇవ్వలేదు’ అని విమర్శించారు.

News February 6, 2026

బాలికల మిస్సింగ్ కేసులు పెరగలేదు: ఢిల్లీ పోలీసులు

image

ఢిల్లీలో బాలికల మిస్సింగ్ కేసులు పెరిగాయన్న ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. పెయిడ్ ప్రమోషన్లతో కొందరు ఈ అంశానికి హైప్ తీసుకొస్తున్నారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా JAN 1 నుంచి 15 మధ్య 509 మంది బాలికలు, మహిళలు తప్పిపోయినట్లు పోలీసుల డేటా వెల్లడించిందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే 2025తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువని, కేసులు పెరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.