News December 23, 2024
అల్లు అర్జున్ పేరు ప్రస్తావించని CM రేవంత్!
TG: నిన్న OU JAC నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటన అనంతరం ‘సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా’ అని CM రేవంత్ ట్వీట్ చేశారు. బన్నీ ఇంటిపైనే దాడి జరిగినట్లు స్పష్టమవుతున్నా ఆయన బన్నీ పేరు ప్రస్తావించలేదు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి మాత్రం అర్జున్ పేరుతోనే ట్వీట్ చేశారు. కాగా, అల్లు అర్జున్ పేరును పలికేందుకు CM విముఖత చూపుతున్నారా? దీనిపై మీ COMMENT.
Similar News
News December 23, 2024
వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి: భట్టి
TG: త్వరలో రీజినల్ రింగ్ రోడ్ పనులకు టెండర్లు పిలుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నాం. మ్యాచింగ్ గ్రాంట్లు, సబ్సిడీ పథకాలు మంజూరు చేసి రాష్ట్ర ప్రజలకు సహకరించాలి. వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలి’ అని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ రివ్యూ మీటింగ్లో వ్యాఖ్యానించారు.
News December 23, 2024
ఇక్కడ స్థిరపడ్డాక ఏపీకి ఎందుకెళ్తాం?: నాగవంశీ
టాలీవుడ్ APకి వెళ్తుందనే ప్రచారం అవాస్తవమని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. తాను డబ్బు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నానని, తనలా స్థిరపడిన వారు తిరిగి APలో ఏం చేస్తారని ప్రశ్నించారు. షూటింగుల్లో ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదు కానీ తెల్లవారుజామున గం.4:30కి సినిమా పడితే చాలని మీడియాకు తెలిపారు. FDC ఛైర్మన్ దిల్ రాజుకు తమ విజ్ఞప్తులు అందిస్తామన్నారు.
News December 23, 2024
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్ల నియామకం భేష్: గుత్తా జ్వాలా
ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంపై బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా హర్షం వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా విప్లవాత్మక చర్యగా మారనుంది. ట్రాన్స్జెండర్ల నియామకంతో సమాజంలో వారికి అధికారిక గుర్తింపు లభించింది. ఈ చర్య మన తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిశీల మార్పునకు శ్రీకారం కానుంది’ అని పేర్కొన్నారు.