News July 8, 2024
రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన?
తెలంగాణ సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. తొలుత తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించాలని ఆయన నిర్ణయించారట. రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Similar News
News January 18, 2025
అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ
AP: రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం డిన్నర్ చేశారు.
News January 18, 2025
జియో రీఛార్జ్ ప్లాన్.. రూ.49కే..
ప్రముఖ టెలికం కంపెనీ జియో రూ.49కే అన్లిమిటెడ్ డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 24 గంటలు. ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ మంచి ఆప్షన్. కానీ ఇందులో కాలింగ్, SMS సౌకర్యం పొందలేరు. రూ.11కే గంటపాటు అన్లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్ను కూడా Jio తీసుకొచ్చింది. ఇప్పటికే జియో నుంచి తీవ్రపోటీ ఎదుర్కొంటున్న Airtel, VI, BSNLకి ఈ కొత్త ప్లాన్లు మరింత సవాలుగా మారే అవకాశాలున్నాయి.
News January 18, 2025
ODI WC23-CT25 మధ్య జట్టులో మార్పులివే
2023 వన్డే వరల్డ్ కప్కు ఎంపికైన 15 మంది ఆటగాళ్లలో 10 మంది 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. సూర్య, ఇషాన్, శార్దుల్, సిరాజ్, అశ్విన్ స్థానాల్లో జైస్వాల్, పంత్, సుందర్, అర్ష్దీప్, అక్షర్ ఎంట్రీ ఇచ్చారు. వీరంతా కూడా జాతీయ జట్టులో ఆడినవారే. ఈసారి కొత్త ముఖాలకు చోటు కల్పించలేదు. ఈ టీమ్ కూర్పు సరిగా లేదని కొందరు విమర్శిస్తుండగా, బాగానే ఉందని పలువురు అంటున్నారు. మీరేమంటారు?