News December 20, 2024
అసెంబ్లీలో గందరగోళంపై సీఎం రేవంత్ ఆరా

TG: అసెంబ్లీలో గందరగోళం నెలకొనగా సీఎం రేవంత్ రెడ్డి సభలో పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చింపి స్పీకర్‌పై వేశారని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ తమకు చెప్పు చూపించారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేయగా, సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Similar News
News January 20, 2026
సంతానోత్పత్తికి సీడ్ సైక్లింగ్

మహిళల సంతానోత్పత్తిలో హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని సమతుల్యంగా ఉంచడానికి సీడ్ సైక్లింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సీడ్ సైక్లింగ్ అనేది అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వుల గింజలు వంటి విత్తనాలను ఒక ప్రత్యేకమైన విధానంలో తినే ఒక ప్రకృతి వైద్య చికిత్స. PMS లక్షణాలను తగ్గించడానికి, ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఈ సీడ్ సైక్లింగ్ ఉపయోగపడుతుంది.
News January 20, 2026
సీడ్ సైక్లింగ్ ఎలా చేయాలంటే?

సీడ్ సైక్లింగ్‌లో పీరియడ్ 1-14 రోజు వరకు రోజుకు అవిసె, గుమ్మడికాయ విత్తనాలను తీసుకోవాలి. 14వ రోజు నుండి పీరియడ్స్ మొదటి రోజు వరకు రోజుకు పొద్దుతిరుగుడు, నువ్వుల గింజలను తీసుకోవాలి. రెగ్యులర్ పీరియడ్‌లో మొదటి 14 రోజులు ఫోలిక్యులర్ దశ, తర్వాత లూటియల్ దశ ఉంటాయి. ఆ సమయానికి తగ్గట్లు సీడ్స్ తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు సమతుల్యతతో ఉంటాయి.
News January 20, 2026
మెగా హీరోతో మారుతి మూవీ.. క్లారిటీ!

డైరెక్టర్ మారుతి తర్వాతి మూవీ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో మెగా హీరోతో చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేసింది. మారుతి తర్వాతి సినిమాపై అధికారికంగా ప్రకటన చేస్తామని పేర్కొంది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ మూవీ ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.


