News August 26, 2024

సీఎం రేవంత్ జైలుకెళ్లే ప్రమాదం ఉంది: నారాయణ

image

TG: హైదరాబాద్‌లో ‘హైడ్రా’ కూల్చివేతలను సీపీఐ నేత నారాయణ సమర్థించారు. ‘హైడ్రా’ ఏర్పాటుతో సీఎం రేవంత్ పులి మీద స్వారీ చేయడం ప్రారంభించారని అన్నారు. ఒకవేళ స్వారీ ఆపేస్తే పులి తినేస్తుందని నారాయణ హెచ్చరించారు. ఈ కూల్చివేతలతో బడా బాబులైనా జైలుకెళతారు లేదా వారి ఒత్తిళ్లతో రేవంత్ జైలుకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్‌లోని ముగ్ధుమ్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Similar News

News December 3, 2025

REMEMBER: ఇద్దరూ సీఎంలను ఓడించిన KVR

image

కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి నేటితో సరిగ్గా రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. 2023 డిసెంబర్ 3న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో, ఒకే స్థానం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఆయన ఓడించి సంచలనం సృష్టించారు. ఈ అపూర్వ విజయం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.

News December 3, 2025

వెనిజులాపై అతి త్వరలో దాడి చేస్తాం: ట్రంప్

image

మొన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. వెనిజులాపై త్వరలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు అమెరికాలోకి రవాణా చేస్తున్న ఏ దేశానికైనా సైనిక చర్య తప్పదన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ బోట్లపై US జరిపిన దాడుల్లో 80 మందికి పైగా చనిపోయారు. వెనిజులాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంతర్జాతీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

News December 3, 2025

స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు

image

AP: టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే వీరు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా పలు స్కూళ్లలో ఇంకా ఖాళీలున్నాయి. మొత్తం 1,146 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి. విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10వేలు ఇస్తారు.