News April 28, 2024
సీఎం రేవంత్ మొనగాడు కాదు: కిషన్రెడ్డి

TG: సీఎం రేవంత్రెడ్డి మొనగాడు కాదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సీఎం సీటు కదులుతుందనే భయంతోనే బీజేపీపై రేవంత్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని తన అజెండాలో లేదని, రేవంత్ మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్పై కోపంతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారని కిషన్రెడ్డి చెప్పుకొచ్చారు.
Similar News
News October 21, 2025
56 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AP: చిత్తూరు DHMO 56 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, MBBS, CA, Mcom, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. విద్యార్హతలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://chittoor.ap.gov.in/
News October 21, 2025
నవంబర్ 19న చీరల పంపిణీ!

TG: మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బతుకమ్మ పండగకే చీరలు ఇవ్వాల్సి ఉండగా అవి సిద్ధం కాకపోవడంతో వాయిదా పడింది. నవంబర్ 15 నాటికి తయారీ పూర్తిచేసి 19న పంచాలని భావిస్తోంది.
News October 21, 2025
జపాన్ ప్రధానిగా సనాయి తకాయిచి ఎన్నిక

జపాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. తొలి మహిళా ప్రధానిగా లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ నేత సనాయి తకాయిచి ఎన్నికయ్యారు. పార్లమెంట్ లోయర్ హౌస్లో జరిగిన ఎన్నికలో మొత్తం 465 ఓట్లకుగానూ ఆమె 237 ఓట్లు సాధించారు. ఇక అప్పర్ హౌస్లోనూ తకాయిచి ఎన్నిక లాంఛనమే కానుంది. కాగా ఐరన్ లేడీ ఆఫ్ జపాన్’గా గుర్తింపు పొందారు.