News August 23, 2025
సురవరం మృతిపై CM రేవంత్, KCR దిగ్భ్రాంతి

TG: కమ్యూనిస్ట్ అగ్ర నేత <<17489686>>సురవరం సుధాకర్ రెడ్డి<<>> మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురవరం మృతి యావత్ దేశానికే తీరని లోటు అని పేర్కొన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొన్నం, కోమటిరెడ్డి, రాజనర్సింహ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News August 23, 2025
EP44: ఈ విషయాల్లో సిగ్గు పడకండి: చాణక్య నీతి

కొన్ని విషయాల్లో సిగ్గు పడితే జీవితానికే నష్టమని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు విషయంలో సిగ్గు పడకూడదు. అప్పు ఇస్తే నిర్మొహమాటంగా అడిగి తీసుకోవాలి. బంధువులు, ఫ్రెండ్స్ ఇళ్లలో తినే విషయంలో సిగ్గు ఉండకూడదు. ఏదో అనుకుంటారని తినకుండా ఆకలి చంపుకోకూడదు. తెలియని విషయాన్ని తెలుసుకొని జ్ఞానం పొందేందుకు ఇతరులను అడిగి నేర్చుకోవాలి. అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయాలి’ అని పేర్కొంటోంది. #<<-se>>#chanakyaneeti<<>>
News August 23, 2025
ఆ ఉద్యోగుల వయోపరిమితి పెంచుతారా?

AP: విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లోని ప్రభుత్వ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై క్యాబినెట్ సబ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిటీ సభ్యులుగా మంత్రులు లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నారు. వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
News August 23, 2025
నేడు పెద్దాపురానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెద్దాపురంలో జరిగే స్వచ్ఛతా ర్యాలీలో సీఎం పాల్గొంటారు. మ్యాజిక్ డ్రైన్లు, స్వచ్ఛతా రథాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత స్థానిక పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఉండవల్లి చేరుకుని సా.5.30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.