News March 3, 2025
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. మ.12.30కి ఢిల్లీ చేరుకోనున్న ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. మ.3.30కి సీఆర్ పాటిల్‌తో సమావేశమై కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఆ తర్వాత మనోహర్‌లాల్ ఖట్టర్‌నూ కలిసే అవకాశం ఉంది.
Similar News
News December 5, 2025
దేవరకొండ ఘటనపై సీఐ వివరణ

తిప్పర్తికి చెందిన దుర్గభవాని మనోవేదనకు గురై బుధవారం దేవరకొండ అటవీ శాఖ వాహనంలో బాలుడిని వదిలినట్లు సీఐ వెంకటరెడ్డి తెలిపారు. దుర్గభవాని భర్త సంతోష్ మధ్య వివాదం నెలకొని 3 నెలలు గడుస్తున్నా అత్తవారింటికి తీసుకెళ్లకపోవడంతో మనోవేదనకు గురై తల్లి బాలుడిని ఇక్కడ వదిలినట్లు తెలిపారు. భర్త సంతోష్‌ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు సీఐ తెలిపారు. తల్లీబిడ్డని ఎస్ఐ మౌనిక సఖీ కేంద్రానికి తరలించారు.
News December 5, 2025
విమానాల రద్దు.. ఈ విషయాలు తెలుసుకోండి!

3 రోజులుగా ఇండిగో విమాన <<18473431>>సర్వీసులు<<>> రద్దవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయాల్లో ఎయిర్‌లైన్స్ పాటించాల్సిన బాధ్యతలపై DGCA రూల్స్ జారీ చేసింది. ఆ ప్రకారం.. సర్వీసు రద్దయితే ముందే సమాచారం ఇవ్వాలి. ప్రత్యామ్నాయ విమానంలో ఫ్రీగా వెళ్లే ఏర్పాటు చేయాలి. ప్రయాణికులు కోరుకుంటే రీఫండ్ చేయాలి. 2గంటలకు మించి ఆలస్యమైతే భోజనం, ఫ్రెష్ అయ్యే సౌకర్యం కల్పించాలి. 24 గంటలు దాటితే ఫ్రీగా హోటల్, రవాణా ఏర్పాటు చేయాలి.
News December 5, 2025
పుతిన్‌కు ‘బాడీ డబుల్స్’ ఉన్నారా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఆయన ‘బాడీ డబుల్స్’ గురించి చర్చ జరుగుతోంది. బహిరంగ కార్యక్రమాలు, ప్రయాణాలకు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. పుతిన్‌కు ముగ్గురు డూప్స్ ఉన్నారని ఉక్రెయిన్ గతంలో చెప్పింది. వారు ‘క్లోన్ ఆర్మీ’ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలని, ‘బాడీ డబుల్’ ప్రతిపాదనలను తాను తిరస్కరించానని గతంలో పుతిన్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.


