News March 7, 2025
ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం రేవంత్ ఢిల్లీ బయల్దేరారు. అక్కడ ఏఐసీసీ పెద్దలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ఆయన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. రేపు మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని అనంతరం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు.
Similar News
News March 9, 2025
మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వనున్న వీవీ వినాయక్?

స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ గత కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఎట్టకేలకు ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. విక్టరీ వెంకటేశ్‌తో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీ ఇప్పటికే స్క్రిప్ట్‌కు ఓకే చెప్పారని సమాచారం. నల్లమలుపు బుజ్జి నిర్మించొచ్చని సినీ వర్గాలంటున్నాయి. ఈ ముగ్గురి కాంబోలో 2006లో వచ్చిన ‘లక్ష్మీ’ సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.
News March 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల ప్రజలు బర్డ్‌ఫ్లూ భయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కొన్ని రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో చికెన్‌కు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్, ఆదిలాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ రూ.160-180గా ఉంది. ఖమ్మంలో రూ.150-170 ధర ఉంది. అటు ఏపీలోని విజయవాడలో కేజీ రూ.200, కాకినాడలో రూ.170-190, విశాఖలో రూ.190 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 9, 2025
19న అశోక్ లేల్యాండ్ యూనిట్ ప్రారంభం

AP: కృష్ణా(D) బాపులపాడు(మ) మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ బాడీబిల్డింగ్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 19న మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2018లో అప్పటి ప్రభుత్వం ఎకరం రూ.16.50 లక్షల చొప్పున 75 ఎకరాలు కేటాయించింది. ఇటీవలే పెండింగ్ పనులన్నీ పూర్తికాగా, ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ యూనిట్లో BS-6 ప్రమాణాలతో ఏటా 4,800 బాడీలు తయారుచేయగలరు.