News July 3, 2024
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ఆయన భేటీ కానున్నారు. మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఇవాళ సాయంత్రం కేశవరావు(కేకే) ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గతంలో కేకే కూతురు విజయలక్ష్మీ హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.
Similar News
News March 13, 2026
AP క్యాబినెట్ నిర్ణయాలు

*మిషన్ శక్తి కింద ‘సఖీ నివాస్’ పేరుతో వర్కింగ్ ఉమెన్స్‌కు హాస్టళ్లు
*అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు.
*సచివాలయం, HOD టవర్ల పనులకు గ్రీన్ సిగ్నల్. మెకానికల్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనుల కోసం ₹2,316 కోట్లకు అనుమతులు.
*FRA పట్టాదారులకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయం
*పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో పనులకు ₹23.47 కోట్లు, ప్యాకేజీ-64A పనులకు ₹24.51 కోట్లు.
News March 13, 2026
ఈ ఏడాదే అనుష్క పెళ్లి..?

టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి(44) ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఈ సంబంధం ఖరారైందని సమాచారం. గతంలో అనేక రూమర్లు వచ్చినప్పటికీ, ఈసారి మాత్రం పెళ్లి పక్కా అని టాక్ వినిపిస్తోంది. దీనిపై అనుష్క టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News March 13, 2026
‘రామాయణంలో పిడకల వేట’ అంటే?

ముఖ్య విషయాన్ని వదిలేసి పనికిరాని వాటి గురించి మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. పండితులు రామాయణం చెబుతుండగా ఓ మహిళ ఇంటి దగ్గర పిడకలు ఏమయ్యాయోనని మధ్యలో అనడంతో ‘రామాయణంలో పిడకల వేట’ వాడుకలోకి వచ్చింది. అలాగే రామాయణంలో ‘త్రిపిటికా:’ అని ఉంది. బౌద్ధ గ్రంథాలనూ ‘త్రిపిటికా’ అంటారు. దీంతో బౌద్ధం తర్వాత రామాయణం వచ్చిందని వాదించే వాళ్ల గురించి చెబుతూ ఈ జాతీయం వచ్చిందని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>


