News May 21, 2024

తిరుపతికి బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి తిరుపతికి బయల్దేరారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి పయనమయ్యారు. ఇవాళ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సీఎం అయ్యాక ఆయన తిరుపతికి వెళ్లడం ఇదే తొలిసారి.

Similar News

News November 2, 2025

గుడ్‌న్యూస్.. జెప్టోలో ఆ ఛార్జీలు ఉండవు!

image

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డర్లపై హ్యాండ్లింగ్ ఫీజులు, సర్జ్, రెయిన్ ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఇకపై ₹99 కంటే ఎక్కువున్న ఆర్డర్లను ఉచితంగా డెలివరీ చేయనుంది. ‘10 నిమిషాల డెలివరీ’ మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి గట్టి పోటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ₹99 కంటే తక్కువ ఉన్న ఆర్డర్లపై మాత్రం ₹30 డెలివరీ ఫీజు వసూలు చేయనుంది.

News November 2, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, యాదాద్రి, నల్గొండలో వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. HYDలో సాయంత్రం నుంచి వాన పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడే ఆస్కారమున్నట్లు వివరించారు.

News November 2, 2025

రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>రైల్‌టెల్<<>> కార్పొరేషన్ లిమిటెడ్‌ 4 పోస్టులను భర్తీ చేయనుంది. సర్వర్ ఎక్స్‌పర్ట్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్, BE, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.railtel.in/