News July 4, 2024
అమిత్‌షాను కలిసిన సీఎం రేవంత్

TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సమస్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది.
Similar News
News November 24, 2025
నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి

TG: సొంత నియోజకవర్గం కొడంగల్‌లో CM రేవంత్ ఇవాళ పర్యటించనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనునున్న గ్రీన్ ఫీల్డ్ కిచెన్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని 316 సర్కార్ స్కూళ్లలో హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ బ్రేక్‌ఫాస్ట్ అందిస్తోంది. అది సక్సెస్ కావడంతో ఇదే తరహాలో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News November 24, 2025
వ్యవసాయంలో ఏటా 15% వృద్ధే లక్ష్యం: సీఎం

AP: ఇవాళ్టి నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నదాతలకు లేఖ రాశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏటా 15% వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘రైతుల కోసం అన్నదాత సుఖీభవ, కిసాన్ డ్రోన్ సేవలు, బిందు సేద్యానికి సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News November 24, 2025
ఇది సరిగా ఉంటే ఆరోగ్యం మీ వెంటే..

మనిషి జీవనశైలిని నియంత్రించేది జీవ గడియారం. అంటే బయోలాజికల్ క్లాక్. రోజువారీ జీవితంలో నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, జీవరసాయన ప్రక్రియలు సమయానికి జరిగేలా చూస్తుంది. అయితే దీంట్లో సమతుల్యత లోపిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. శారీరకంగా, మానసికంగా క్రమంగా శక్తిహీనులుగా మారిపోతుంటే అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.


