News July 1, 2024

గవర్నర్‌తో సీఎం రేవంత్ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి ఆయనతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై రేవంత్ చర్చిస్తారని సమాచారం. మరోవైపు నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరాయి.

Similar News

News April 16, 2026

యుద్ధం సెగ.. సబ్బుల ధరలకు రెక్కలు!

image

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతోంది. క్రూడాయిల్ ధరలు పెరగడం, సముద్ర మార్గాల్లో రవాణా అడ్డంకులు నిత్యావసరాల ధరలను పెంచేస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు, ప్యాకేజింగ్ ఖర్చులు భారమవ్వడంతో సబ్బులు, షాంపులు, సర్ఫ్‌లు సహా మరికొన్ని నిత్యావసర వస్తువుల రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే HUL తమ లిరిల్, పియర్స్, డవ్ వంటి బ్రాండ్లతో ఉన్న ప్రొడక్ట్స్ ధరలను ₹2-₹3 వరకు పెంచింది.

News April 16, 2026

మహిళా రిజర్వేషన్ల అమలుకు సమయం ఆసన్నమైంది: అర్జున్ మేఘ్వాల్

image

పార్లమెంటు చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. లోక్‌సభలో ఇవాళ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘2023లోనే నారీశక్తి వందన్ అధినియం బిల్లు ఆమోదం పొందింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయింపును పార్లమెంటు ఆమోదించింది. దీన్ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించారు.

News April 16, 2026

41-44°C టెంపరేచర్.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 5 రోజులు ఎండలు దంచికొడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో 41-44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో 36-40°C వరకు టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. జిల్లాల వారీగా వివరాలను రెండో ఫొటోలో చూడొచ్చు.