News July 2, 2024

నేడు అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్ భేటీ

image

TG: అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం కానున్నట్లు సమాచారం. శాఖల వారీగా అధికారులు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. శాఖల వారీగా పనితీరు, సమస్యలను సమీక్షించి.. ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వివరించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 20, 2024

సిట్టింగ్ జడ్జి/ హైకోర్టు కమిటీతో విచారించాలి:YCP

image

తిరుమల లడ్డూ ప్రసాదంపై CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించినట్లు YCP ట్వీట్ చేసింది. ‘హైకోర్టులో వైసీపీ న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని హైకోర్టును న్యాయవాది కోరారు. పిల్ దాఖలు చేస్తే బుధవారం వాదన వింటామని ధర్మాసనం చెప్పింది’ అని YCP ట్వీట్ చేసింది.

News September 20, 2024

టీటీడీని ప్రక్షాళన చేస్తాం: మంత్రి లోకేశ్

image

AP: వైసీపీ దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేసిందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. తిరుమల బోర్డును తమ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలబోనని స్పష్టం చేశారు. క్యాన్సర్ గడ్డలా మారిన పాపాల పెద్దిరెడ్డిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

News September 20, 2024

80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్ పోటీల్లో!

image

నైపుణ్యం సాధించేందుకు వయసుతో పని లేదనే విషయాన్ని గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల స్విమ్మర్ బకుల పటేల్ నిరూపించారు. 13 ఏళ్లకే పెళ్లవడం, పిల్లలు యుక్తవయసులో ఉండగానే భర్తను కోల్పోవడంతో ఆమె ఒంటరైపోయారు. భయాన్ని పోగొట్టేందుకు పటేల్ ఈతను ఎంచుకున్నారు. 58 ఏళ్ల వయసులో నదిలో మునిగి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా పట్టుదలతో ఈతలో ప్రావీణ్యం పొందారు. ఇప్పటికే 9 అంతర్జాతీయ విజయాలు సహా 530+ పతకాలు సొంతం చేసుకున్నారు.