News December 4, 2024
నేడు పెద్దపల్లికి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. పెద్దపల్లిలో జరిగే యువ వికాసం సభలో ఆయన పాల్గొంటారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన 9 వేల మందికి నియామక పత్రాలు అందిస్తారు. ఫోర్ లేన్ బైపాస్ రోడ్, సబ్ స్టేషన్లు, సీఎం కప్ ప్రారంభంతోపాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News April 3, 2026
కువైట్‌పై ఇరాన్ భీకర దాడులు

కువైట్, UAE లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. తమ డీసాలినేషన్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీపై అటాక్ జరిగినట్లు కువైట్ అధికారులు ధ్రువీకరించారు. మినా అల్ అహ్మదీ రిఫైనరీలోని కొన్ని యూనిట్లు మంటల్లో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తమ దేశంపై మిస్సైల్స్, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిందని UAE తెలిపింది. తాము అడ్డుకున్న మిస్సైల్ శకలాలు పడి హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీలో మంటలు చెలరేగాయని చెప్పింది.
News April 3, 2026
సోషల్ ప్రోగ్రెస్ గురించి రేవంత్ చెప్పడం విడ్డూరం: విజయన్

అవినీతి ప్రభుత్వం అంటూ తమపై TG CM <<19546692>>రేవంత్<<>> విమర్శలు చేయడంపై కేరళం CM పినరయి విజయన్ ఫైరయ్యారు. ‘పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు నడిపే వ్యక్తి సోషల్ ప్రోగ్రెస్ గురించి చెప్పడం విడ్డూరం. దేశంలో అత్యంత తక్కువ అవినీతి, అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం మాది. అక్షరాస్యతలో మేమే ముందున్నాం. శాలరీలు, పెన్షన్లు ఆలస్యం చేసే మీరే మా దగ్గర పాలన, సంక్షేమం గురించి నేర్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
News April 3, 2026
‘అగస్త్య భ్రాత’ అంటే ఎవరు?

ఊరూపేరు, తనకంటూ ఏ గుర్తింపు లేని వ్యక్తిని అగస్త్య భ్రాతగా అభివర్ణిస్తారు. రాముడు అరణ్యవాసంలో అగస్త్య మహర్షితోపాటు ఆయన సోదరుడి ఆశ్రమానికి వెళ్లినట్లు వాల్మీకి రామాయణంలో ఉంది. కానీ ఆయన పేరు, వివరాలేంటో ప్రస్తావించలేదు. అలా అగస్త్య భ్రాత(భ్రాత అంటే సోదరుడు) అనామకుడిగా మిగిలిపోయాడు. గొప్ప వ్యక్తికి అప్రసిద్ధుడైన సోదరుడు ఉన్నాడని చెప్పే క్రమంలో ఈ జాతీయాన్ని ఎక్కువగా వాడతారు.
<<-se>>#EPICSAYINGS<<>>


