News March 17, 2024

గంట నుంచీ విమానంలోనే సీఎం రేవంత్!

image

ముంబై వెళ్లేందుకు సీఎం రేవంత్ ఎక్కిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ముంబైలో రాహుల్ న్యాయ్ యాత్ర సభకు వెళ్లేందుకు ఆయనతో పాటు దీపాదాస్ మున్షీ, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితర అగ్రనేతలు విమానం ఎక్కారు. అయితే, ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో గంట నుంచీ అందులోనే ఉండిపోయారు. దీంతో వారి ముంబై ప్రయాణం ఆలస్యం కానుంది.

Similar News

News April 2, 2025

బీసీల డిమాండ్‌ను బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు: సీఎం

image

రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు చేపట్టిన ధర్నాలో రేవంత్ పాల్గొన్నారు. బీసీల లెక్క తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని కోర్టులు చెప్పాయని, అందుకే బీసీ కులగణన చేపట్టామని చెప్పారు. బీసీల డిమాండ్ న్యాయబద్ధమైనదని, దీన్ని బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు.

News April 2, 2025

ALERT: ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా?

image

మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వెకేషన్‌కు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి మద్రాస్ హైకోర్టు ఈ-పాస్‌ తప్పనిసరి చేసింది. టూరిస్టుల భద్రత, పర్యావరణ పరిరక్షణ, రద్దీ తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-పాస్ ఉంటేనే నీలగిరి, దిండిగల్ జిల్లాల్లోకి పోలీసులు వాహనాలను అనుమతిస్తారు. ఈ-పాస్ కోసం https://epass.tnega.org/ సైట్‌లో అప్లై చేసుకోవాలి.

News April 2, 2025

ఏప్రిల్ 12-15 మధ్య ఇంటర్ ఫలితాలు?

image

AP: రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 – 15వ తేదీల మధ్య విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాగా ఏప్రిల్ 6న ముగియనుంది. ఆ తర్వాత వాటిని కంప్యూటర్‌లో నమోదు చేయడానికి ఐదారు రోజులు పడుతుందని, ఆ తర్వాతే ఫలితాలు రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా.. 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.

error: Content is protected !!