News November 7, 2024
రేపే సీఎం రేవంత్ పాదయాత్ర

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం సంగెం నుంచి భీమలింగంలోని మూసీ నది వరకు 2.5 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర చేస్తారు. అక్కడే రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.
Similar News
News January 20, 2026
చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.
News January 20, 2026
స్టార్ హోటళ్లు, రిసార్టులతో టూరిస్ట్ హబ్‌గా విశాఖ

AP: స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్టులతో టూరిస్ట్ హబ్‌గా విశాఖ మారుతోంది. నగరంలో ₹1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నాయి. ITC ₹328 కోట్లతో హోటల్ నిర్మిస్తుండగా, అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీపంలో Oberoi సంస్థ 7-స్టార్ లగ్జరీ రిసార్ట్, హోటల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. వరుణ్ గ్రూపు కూడా హోటల్ నిర్మిస్తోంది. వీటితో పర్యాటకులను ఆకర్షించడంతోపాటు వేలాది మందికి ఉపాధి దక్కనుంది.
News January 20, 2026
కరూర్ తొక్కిసలాట.. నిందితుడిగా విజయ్ పేరు?

కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి CBI <<18898953>>విచారణకు<<>> నిన్న రెండోసారి విజయ్ హాజరైన విషయం తెలిసిందే. త్వరలో ఆయన్ను నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఏడీజీపీ, మరో పోలీసు అధికారిపైనా అభియోగాలు మోపే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో CBI ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందని, అందులో విజయ్ పేరు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోయారు.


