News July 28, 2024
జైపాల్‌రెడ్డికి నివాళులర్పించిన సీఎం రేవంత్

TG: దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ ఆయనకు నివాళులర్పించారు. HYD నెక్లెస్‌రోడ్డులోని స్ఫూర్తి స్థల్లో రేవంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News October 24, 2025
భారత్ ఓటమికి కారణాలివే?

నిన్న AUS చేతిలో టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణం మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ను ఆడించకపోవడమేనని తెలుస్తోంది. మిడిల్ ఓవర్లలో మన బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. అటు ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ జంపా 4 వికెట్లతో సత్తా చాటారు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ నితీశ్ కాకుండా సుందర్ ముందుగా రావడమూ ఓ కారణంగా కనిపిస్తోంది. కోచ్ గంభీర్ నిర్ణయాలతో పాటు కొత్త కెప్టెన్ గిల్ అనుభవలేమి కనిపిస్తోంది. మీ కామెంట్?
News October 24, 2025
ఇతిహాసాలు క్విజ్ – 45

1. పుష్పక విమానాన్ని రావణుడు ఎవరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాడు?
2. కురు రాజ్యానికి మంత్రి ఎవరు?
3. ఆంజనేయుడికి గదను ఆయుధంగా ఎవరు ఇచ్చారు?
4. లక్ష్మీదేవి ఎక్కడ ఆవిర్భవించింది?
5. యమధర్మరాజు సోదరి ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 24, 2025
SECILలో 22 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SECIL)లో 22 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బీటెక్/బీఈ, పీజీ, ఎంటెక్, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, ఎక్స్సర్వీస్మెన్లకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.seci.co.in/


