News August 25, 2025
ఓయూకు చేరుకున్న సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర సీఎం ఓయూకు వెళ్లడం ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన పర్యటన నేపథ్యంలో నిరసనకు దిగుతారన్న సమాచారంతో బీఆర్ఎస్వీ, ఏబీవీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వర్సిటీ పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
Similar News
News August 25, 2025
రేపు హైలెవెల్ మీటింగ్.. టారిఫ్స్‌పై చర్చ!

ట్రంప్ సెకండరీ టారిఫ్స్ ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో రేపు PM మోదీ ఆఫీస్‌లో హైలెవెల్ మీటింగ్ జరగనున్నట్లు తెలిసింది. PM ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో నిర్వహించే ఈ సెషన్‌లో 50% టారిఫ్స్‌తో ఎగుమతిదారులపై పడే ప్రభావం గురించి చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే ఎక్స్‌పోర్టర్స్, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ నుంచి కేంద్రం డేటా సేకరించింది. నష్ట నివారణకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
News August 25, 2025
‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్‌కు ఆర్థికసాయం

TG: ‘పుష్ప-2’ విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ‘మిషన్ వాత్సల్య పథకం’ కింద బాలుడికి 18 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.4,000 అందించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు గడచిన 3 నెలలకుగాను రూ.12వేలు వారి ఖాతాలో జమ చేసింది. కాగా ఈ ఘటనలో బాలుడి తల్లి రేవతి చనిపోగా, గాయపడిన శ్రీతేజ్ ఇంకా కోలుకుంటున్నాడు.
News August 25, 2025
రష్యాలో భారతీయ కార్మికులకు పెరిగిన డిమాండ్!

వలసలపై US, UK సహా పాశ్చాత్య దేశాల నుంచి భారతీయులపై ఆంక్షలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రష్యా కంపెనీలు ముందుకొచ్చినట్లు ఇండియన్ అంబాసిడర్ వినయ్ కుమార్ తెలిపారు. ‘మెషినరీ, టెక్స్‌టైల్స్ రంగాల్లో మన కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడి చట్టాలకు లోబడి ప్రస్తుతం కంపెనీలు పెద్దఎత్తున మన కార్మికులను హైర్ చేసుకుంటున్నాయి’ అని తెలిపారు.