News December 20, 2024
అసెంబ్లీకి చేరుకున్న CM రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ధరణిలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై విచారణకు ఆదేశించే యోచనలో ఉంది. ఆ ప్రత్యేక విచారణపై సీఎం సభలో ప్రకటించే అవకాశం ఉంది. అటు, మాజీ మంత్రి హరీశ్ రావు ఎంఐఎం ఎమ్మెల్యేలను కలిశారు. ఫార్ములా ఈ-కార్ రేసుపై చర్చకు వచ్చేలా సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News January 11, 2026
ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో ఉద్యోగాలు

ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీలో 45 జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JSOకు నెలకు రూ.68,697, JSAకు రూ.42,632 చెల్లిస్తారు. https://fsl.delhi.gov.in
News January 11, 2026
ఇంటికి చేరుకోవడమే పెద్ద ‘పండుగ’

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ట్రాఫిక్, మరోవైపు సమయానికి బస్సులు, రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటికి చేరుకోవడమే పెద్ద పండుగగా భావిస్తున్నారు. VJA-HYD హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అటు HYDలోని బస్టాండ్లలో వచ్చిన వెంటనే బస్సులు కిక్కిరిసిపోతుండటంతో పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
News January 11, 2026
సారీ.. ఆ మెయిల్స్ను పట్టించుకోవద్దు: డేటా లీక్పై ఇన్స్టాగ్రామ్

యూజర్ల సెన్సిటివ్ <<18820981>>డేటా లీక్<<>> అయినట్లు వచ్చిన వార్తలను ఇన్స్టాగ్రామ్ ఖండించింది. యూజర్లు పాస్వర్డ్ మార్చుకోవాలని తమ పేరుతో వచ్చిన మెయిల్స్ను పట్టించుకోవద్దని కోరింది. అలా మెయిల్స్ రావడానికి కారణమైన సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించింది. ప్రతిఒక్కరి ఇన్స్టా ఖాతా సేఫ్గా ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా క్రియేట్ అయిన గందరగోళానికి క్షమాపణలు చెప్పింది.


