News April 11, 2024

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులపై పార్టీ అధిష్ఠానంతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను ఆయన కోరనున్నారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Similar News

News January 22, 2026

అక్షరాభ్యాసానికి శుభ ముహూర్తం ఎప్పుడంటే?

image

2026లో వసంత పంచమి జనవరి 23, శుక్రవారం వచ్చింది. పంచమి తిథి శుక్రవారం తెల్లవారుజామున 2:28 గంటలకే ప్రారంభమవుతుంది. పూజకు, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఉదయం 7:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:33 గంటల వరకు అత్యంత శుభప్రదమైన సమయం. సూర్యోదయ తిథి ప్రాధాన్యత కలిగిన ఈ సమయంలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే చదువుల తల్లి దీవెనలతో పిల్లలు ఉన్నత విద్యావంతులుగా తయారవుతారని పండితులు సూచిస్తున్నారు.

News January 22, 2026

త్వరలో 600 మంది వైద్య సిబ్బంది నియామకం: వివేక్

image

TG: ఈఎస్ఐ‌లో త్వరలో 600 మంది వైద్య సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి వివేక్ తెలిపారు. డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ESIలో పేషంట్లకు ట్రీట్‌మెంట్‌లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నాచారం ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఆర్సీపురంలో ఐసీయూ ఏర్పాటుకు మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

News January 22, 2026

వరి పంటకు పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారా?

image

వరి పిలకల దశలో యూరియాతో పాటు చాలా మంది రైతులు DAP, 20-20-0 వంటి కాంప్లెక్స్ ఎరువులను ఎకరాకు ఒక బస్తా చొప్పున వేస్తుంటారు. ఈ కాంప్లెక్స్ ఎరువులలో ఉండే భాస్వరం కేవలం 20 నుంచి 25 శాతమే మొక్కలకు అందుతుంది. మిగతాది అంతా భూమిలో మొక్కలకు అందని స్థితిలో మారిపోతుంది. దీనికి బదులు ‘నానో డీఏపీ’ని ఎకరాకు అర లీటరు స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.