News July 8, 2025

జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

image

TG CM రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. తాజాగా ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరతపై చర్చించారు. ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయిందని, మరో 3 లక్షల టన్నులు రావాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా యూరియాతో పాటు ఎరువులు సరఫరా చేయాలని కోరారు. కొద్దిసేపట్లో పీయూష్ గోయల్‌తోనూ సీఎం రేవంత్ సమావేశం కానున్నారు.

Similar News

News July 8, 2025

ఆమెతో ఇప్పటికే పెళ్లయిపోయింది: ఆమిర్ ఖాన్

image

బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ తన ప్రేయసి గౌరీ స్ప్రాట్‌తో మూడో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, ఆమెతో ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా బంధం పట్ల గౌరీ, నేనూ సీరియస్‌గా ఉన్నాం. మేము ఇప్పుడు జీవిత భాగస్వాములమయ్యాం. ఇక పెళ్లి గురించి అంటారా.. నా మనసులో నేను ఇప్పటికే ఆమెను వివాహం చేసుకున్నా. అధికారికంగా ఎప్పుడు ప్రకటించాలో త్వరలో నిర్ణయించుకుంటాం’ అని తెలిపారు.

News July 8, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 8, 2025

US కొత్త చట్టం.. పెరగనున్న వీసా ఫీజులు

image

US ప్రెసిడెంట్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్‌’తో వీసా ఫీజులు పెరగనున్నాయి. నాన్ ఇమిగ్రెంట్లు తప్పనిసరిగా వీసా జారీ సమయంలో ఇంటిగ్రిటీ ఫీజు కింద $250 చెల్లించాలి. భవిష్యత్ నిబంధనలకు అనుగుణంగా ఇది పెరగొచ్చు. 2026 నుంచి కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఈ మొత్తం ఏటా పెరుగుతూ ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం లేదా రద్దు చేయడానికి వీలుండదు.