News December 19, 2024

నేడు గంట ముందుగానే అసెంబ్లీకి CM రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు గంట ముందుగానే అసెంబ్లీకి చేరుకోనున్నారు. కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. నేడు భూభారతి, రైతు భరోసాపై సభలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆయన వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Similar News

News December 19, 2025

ఆ రోజే సూసైడ్ చేసుకోవాల్సింది: హీరోయిన్

image

మలయాళ హీరోయిన్‌పై గ్యాంగ్ రేప్ <<18547134>>కేసులో<<>> ఆరుగురికి 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. నిందితుల్లో ఒకరైన మార్టిన్ ఆంటోనీ బాధితురాలి ఐడెంటిటీని వెల్లడించడంపై ఆ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నన్ను ఇలా బతకనివ్వండి. ఘటనపై ఫిర్యాదు చేసి తప్పు చేశా. ఆ రోజే నేను చనిపోవాల్సింది. మీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. తన పేరు వెల్లడించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

News December 19, 2025

చెన్నై టీమ్‌కు నాసా ‘మోస్ట్ ఇన్‌స్పిరేషనల్ అవార్డు’

image

నాసా 2025 ఇంటర్నేషనల్ స్పేస్ యాప్స్ ఛాలెంజ్‌లో చెన్నై ఫొటోనిక్స్ ఒడిస్సీ టీమ్‌ మోస్ట్ ఇన్‌స్పిరేషనల్ అవార్డును గెలిచింది. ఇండియాలో ఇంటర్నెట్ లేనిచోట హైస్పీడ్ కనెక్టివిటీ కోసం ప్రత్యేక శాటిలైట్ ఇంటర్నెట్ విధానాన్ని వీళ్లు ప్రతిపాదించారు. ఈ పోటీలో 167 దేశాల నుంచి దాదాపు 1.14 లక్షల మంది పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్ ఇతర విభాగాల్లో గెలుపొందిన వారిలో భారత సంతతికి చెందినవాళ్లు పెద్ద సంఖ్యలో ఉండటం విశేషం.

News December 19, 2025

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్‌తో హోటళ్లకు గిరాకీ

image

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్స్‌తో హోటళ్ల బిజినెస్ కళకళలాడుతోంది. వీటివల్ల కొత్త కస్టమర్లను చేరుకోగలుగుతున్నామని 59% ఓనర్లు పేర్కొన్నట్లు NCAER FY23-24 నివేదిక వెల్లడించింది. ‘హోటళ్లకు మొత్తంగా 50.4% కస్టమర్లు పెరిగారు. 52.7% కొత్త మెనూ ఐటమ్స్ యాడ్ అయ్యాయి. ప్లాట్‌ఫార్మ్స్‌ ద్వారా హోటళ్లకు వచ్చే షేర్ 29%కి చేరింది. ఎంప్లాయిమెంటు 1.08 మిలియన్ల నుంచి 1.37 మిలియన్లకు పెరిగింది’ అని వివరించింది.