News August 21, 2025

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి పయనమవుతారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పలువురు కీలక నేతలతో రేవంత్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Similar News

News August 21, 2025

‘ఇంటర్వెల్ వాకింగ్’ చేస్తున్నారా?

image

‘ఇంటర్వెల్ వాకింగ్’తో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ జపాన్ పద్ధతిలో 3 నిమిషాలు వేగంగా, మూడు నిమిషాలు నెమ్మదిగా నడుస్తారు. కనీసం వారానికి నాలుగు రోజుల పాటు 30 నిమిషాల చొప్పున నడిస్తే మేలని అంటున్నారు. ఈ వాకింగ్‌తో బీపీతో పాటు కీళ్ల నొప్పులు తగ్గాయని తాజా అధ్యయనంలో తేలింది. దీంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ వాకింగ్‌తో గాలిని క్రమ పద్ధతిలో పీల్చుకుంటారు.

News August 21, 2025

భారీగా తగ్గనున్న పాలసీల ధరలు!

image

ఆరోగ్య, వ్యక్తిగత జీవిత బీమా ప్రీమియం ధరలు తగ్గనున్నాయి. ఈ పాలసీలను GST నుంచి మినహాయించాలని మోదీ సర్కారు ప్రతిపాదించినట్లు బీమాపై ఏర్పాటైన మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు. అన్ని రాష్ట్రాలు దీనికి సుముఖత వ్యక్తం చేసినట్లు, త్వరలోనే GST కౌన్సిల్‌కు ఈ అంశంపై నివేదిక ఇస్తామన్నారు. ఇది అమలైతే కేంద్రానికి పన్ను రాబడి రూ.9,700కోట్ల వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పాలసీలపై 18% GST ఉంది.

News August 21, 2025

ఉద్ధృతంగా గోదావరి.. ఉ.11గంటలలోపు మొదటి ప్రమాద హెచ్చరిక!

image

గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద 50.3 అడుగుల నీటిమట్టం ఉండగా, రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.75 లక్షల క్యూసెక్కులుగా ఉందని APSDMA వెల్లడించింది. ఉదయం 11గంటల లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఆస్కారముందని తెలిపింది. అటు, ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్, ఔట్ ఫ్లో 5.04 లక్షల క్యూసెక్కులుగా ఉందని, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు చెప్పింది.