News November 14, 2024
సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

TG: గురుకులాల్లో కల్తీ ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలపై CM రేవంత్ స్పందించారు. గురుకులాలకు నాసిరకం ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటివారు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో డైట్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ స్కూల్స్‌ను సందర్శించాలని ఆదేశించారు.
Similar News
News December 2, 2025
హైదరాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ

తెలంగాణ రైజింగ్ విజన్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు, వ్యక్తులు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన అజయ్ దేవ్‌గణ్ ఫ్యూచర్ సిటీలో తన ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఇదివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వంతో M0U చేసుకోనున్నట్లు సమాచారం.
News December 2, 2025
Karnataka: సిద్ద-శివ నాటు చికెన్ ‘బ్రేక్‌ఫాస్ట్’

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళ బెంగళూరులో శివకుమార్ ఇంట్లో ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఇడ్లీ, దోశ, ఉప్మా, నాటు చికెన్ అల్పాహారంగా తీసుకున్నారు. సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు CMకు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా CM అంశంపై ఇరు వర్గాల మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.
News December 2, 2025
‘కోహ్లీ’ దిగ్గజాలను దాటేశారు: ఫ్యాన్స్

SAపై తాజా సెంచరీతో వన్డేల్లో కోహ్లీ 52 సెంచరీలు చేసి ఓ ఫార్మాట్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా నిలిచారు. అయితే సెంచరీల్లో దిగ్గజ ప్లేయర్లను విరాట్ ఎప్పుడో దాటేశారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కోహ్లీ వన్డేల్లో 294 ఇన్నింగ్స్ ఆడారని, ఇదే సంఖ్యలో ఆడిన తర్వాత సచిన్ సెంచరీలు 33 అని, పాంటింగ్ 26, గేల్ 25 శతకాలు బాదారని పోస్టులు పెడుతున్నారు. బ్యాటింగ్ AVG కూడా కోహ్లీ(58)దే ఎక్కువ అని చెబుతున్నారు.


