News December 6, 2024
రేపు నల్గొండలో లక్ష మందితో CM రేవంత్ సభ

TG: CM రేవంత్ రెడ్డి రేపు నల్గొండలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ఏర్పడి రేపటికి ఏడాది కానుండటంతో జిల్లా కేంద్రంలో లక్ష మందితో సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. బ్రహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లు, గంధంవారిగూడెం వద్ద నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాల తదితర అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Similar News
News March 31, 2026
స్పామ్ కాల్స్‌ను అడ్డుకోండిలా!

స్పామ్ కాల్స్, SMSలతో విసిగిపోయారా? వాటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ DND యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో మీ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుంటే ఇలాంటి కాల్స్‌ను బ్లాక్ చేయవచ్చు. ఏయే ప్రమోషనల్ మెసేజ్‌లు రావాలో ఎంచుకోవచ్చు. స్పామ్ కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేసి, ట్రాక్ చేయొచ్చు. 2025లో ఇలాంటి 1,84,482 స్పామ్ కాల్స్‌ను ట్రాయ్ తొలగించింది. ఈ <
News March 31, 2026
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,030 పెరిగి రూ.1,49,290గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.950 ఎగబాకి రూ.1,36,850 పలుకుతోంది. ఇక వెండి ధర కేజీపై రూ.5వేలు తగ్గి రూ.2,50,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని ధరల్లో స్వల్ప తేడాలుంటాయి
News March 31, 2026
హార్ముజ్‌పై బిల్లుకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం

హార్ముజ్ మీదుగా వెళ్లే నౌకలపై ఛార్జీలు విధించాలన్న ప్రతిపాదనకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నిషేధం విధించిందని.. ఆంక్షలు విధించే ఇతర దేశాలకూ ఇది వర్తించనున్నట్లు పేర్కొంది. అయితే ఎంత చెల్లించాలి? ఇండియా ఈ లిస్ట్‌లో ఉందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా భారత నౌకలకు ఇరాన్ ఎలాంటి ఛార్జ్ చేయట్లేదని కేంద్రం ఇటీవల పేర్కొంది.


