News March 16, 2025

CM రేవంత్ దీనికి సమాధానం చెప్పాలి: KTR

image

TG: OUలో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని KTR అన్నారు. నిరసన తెలిపే హక్కును కాపాడతామని ఇచ్చిన హామీ ఏమైందో CM సమాధానం చెప్పాలన్నారు. ‘ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోంది. నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తానన్న CM, 6 గ్యారంటీలతో పాటు దీనిని అటకెక్కించారు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 24, 2025

కాసేపట్లో భారీ వర్షం..

image

TG: రాబోయే 2 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయన్నారు.

News October 24, 2025

భారత తొలి మహిళా వార్‌ జర్నలిస్ట్‌ ప్రభాదత్‌

image

అనేక పురుషాధిక్య రంగాల్లో ప్రస్తుతం మహిళలు కూడా సత్తా చాటుతున్నారు. కానీ 1965లో ఒక మహిళ యుద్ధక్షేత్రంలోకి దిగి ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని రిపోర్ట్ చేసిందంటే నమ్మగలరా.. ఆమే భారతదేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్. ఆమె ఏం చేసినా సెన్సేషనే. ఎన్నో స్కాములను ఆమె బయటపెట్టారు. ఎన్నో బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయలేదు. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్‌ అవార్డ్‌ వరించింది.

News October 24, 2025

లిక్కర్ స్కామ్ కేసు.. రిమాండ్ పొడిగింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 7 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టు కాగా ఐదుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. ఏడుగురు నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.