News June 5, 2024
అందుకు సీఎం రేవంత్ రాజీనామా చేయాలి: డీకే అరుణ

TG: మహబూబ్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రాజీనామా చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని సీఎం తప్పుడు ప్రచారం చేశారని మీడియా సమావేశంలో విమర్శించారు. TGలో బీజేపీకి 10 సీట్లు వస్తాయని అంచనా వేసినా 8కే పరిమితమయ్యామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో ఇక్కడి ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
Similar News
News December 9, 2025
తొలి విడత పోలింగ్కు సర్వం సిద్ధం: అడిషనల్ కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)
ఎ.భాస్కర్రావు తెలిపారు. తొలి విడతలోని 6 మండలాల్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తొలి విడతలో 153 సర్పంచ్లకు గాను 15 జీపీలు ఏకగ్రీవమయ్యాయని, మొత్తంగా 138 జీపీలు, 1,197 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
News December 9, 2025
అధికారం కోల్పోయాక విజయ్ దివస్లు.. BRSపై కవిత విమర్శలు

TG: బీఆర్ఎస్పై జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవాళ ఆ పార్టీ ‘విజయ్ దివస్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె సంచలన ట్వీట్ చేశారు. ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు.. విజయ్ దివస్లు. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు!!’ అని రాసుకొచ్చారు. పార్టీ నుంచి బయటికొచ్చాక బీఆర్ఎస్పై కవిత తరచూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
News December 9, 2025
వీసా రూల్స్ అతిక్రమించిన చైనా సిటిజన్.. అరెస్ట్

2 వారాల నుంచి లద్దాక్, జమ్మూ కశ్మీర్లో తిరుగుతున్న చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ షెంజెన్కు చెందిన హు కాంగ్టాయ్ను సెక్యూరిటీ ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీ, UP, రాజస్థాన్లోని బౌద్ధ మత ప్రదేశాల సందర్శనకు NOV 19న టూరిస్ట్ వీసాపై అతడు ఢిల్లీ వచ్చాడు. రూల్స్ అతిక్రమించి లద్దాక్, J&K వెళ్లాడు. ఆర్టికల్ 370, CRPF బలగాల మోహరింపు, సెక్యూరిటీకి సంబంధించిన వివరాలు ఫోన్లో సెర్చ్ చేశాడు.


