News December 28, 2024

హైడ్రా ఛైర్మన్‌గా సీఎం రేవంత్: రంగనాథ్

image

TG: హైడ్రా ఛైర్మన్‌గా CM రేవంత్ కొనసాగుతారని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటివరకు హైడ్రాకు 5,800 ఫిర్యాదులు అందాయని చెప్పారు. ‘హైడ్రా పరిధిలో 8 చెరువులు, 12 పార్కులను కాపాడాం. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నాం. హైడ్రాతో ప్రజల్లో చైతన్యం పెరిగింది. కొత్తగా ఇల్లు, ఫ్లాట్లు కొనేవారు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు.

Similar News

News December 29, 2024

నేడు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

image

TG: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో నేడు స్వామివారి కళ్యాణం జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో స్వామి వివాహం నిర్వహించనున్నారు. దీంతో మూడు నెలలపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ప్రభుత్వం తరఫున మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.

News December 29, 2024

ఇతడు నిజమైన రాజు!

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు, ప్రఖ్యాతులు ఎంత గొప్పవో పైన ఫొటో చూస్తే తెలుస్తోంది కదూ! పై ఫొటోలో ఉంది భూటాన్ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్. మన్మోహన్ మరణవార్తను తెలుసుకుని ఢిల్లీకి వచ్చారు. కింద కూర్చొని సింగ్ సతీమణి గుర్‌శరణ్ కౌర్‌ను ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. తాను రాజుననే విషయం మర్చిపోయి అత్యంత గౌరవంగా వ్యవహరించారు. అతడు నిజమైన రాజు అని నెటిజన్లు అభినందిస్తున్నారు.

News December 29, 2024

నెలాఖరులో రూ.1000 కోట్ల మద్యం అమ్మకాలు?

image

TG: కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే స్టాక్ మద్యం డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. గత మూడు రోజుల్లో రూ.565 కోట్ల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇవాళ మద్యం డిపోలకు సెలవుదినం అయినప్పటికీ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. ఈ ఏడాది నెలాఖరుకు రూ.1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.