News September 11, 2024
సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరనున్నట్లు తెలుస్తోంది. భేటీ విషయమై సీఎంవో ప్రధాని అపాయింట్మెంట్ కోరింది. వరద నష్టంపై మోదీకి రేవంత్ నివేదిక ఇవ్వనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశముంది.
Similar News
News January 23, 2026
వరుసగా 3 రోజులు సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లో కొందరికి వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్వేర్ సహా పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు సోమవారం రిపబ్లిక్ డే రావడంతో లాంగ్ వీకెండ్ కానుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు సైతం వారానికి 5 రోజులే నడుస్తుండటం, 26న పబ్లిక్ హాలిడే కావడంతో స్టూడెంట్స్ రేపట్నుంచి 3 రోజులు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.
News January 23, 2026
APPLY NOW: SACONలో 36 పోస్టులు

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(<
News January 23, 2026
వసంత రుతువులో ప్రకృతి ఎందుకు పులకరించిపోతుందో తెలుసా?

వసంత పంచమికి, ప్రేమ దేవుడు మన్మథుడితో సంబంధం ఉంది. శివుడి ధ్యానాన్ని భంగం కలిగించి, పార్వతీ దేవిపై ఆయనకు అనురాగం కలిగేలా చేయడానికి మన్మథుడు పూబాణాలు ప్రయోగించిన రోజు ఇదేనట. దీంతో శివుడు మూడో కంటితో మన్మథుడిని భస్మం చేశాడు. రతీదేవి వేడుకోలుపై తిరిగి ప్రాణం పోశాడు. ఈ కాలంలో కొత్త చిగుళ్లతో ప్రకృతి పులకించేలా చేసేది మన్మథుడని నమ్ముతారు. అందుకే ఈరోజును ప్రేమకు, సృజనాత్మకతకు ప్రతీకగా చెబుతారు.


