News November 29, 2024

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్‌ రెడ్డితో సహా పలువురు కీలక నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. సీఎం వెంట మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి పయనం కానున్నారు. దీపాదాస్ మున్షీ, వంశీచంద్ రెడ్డి తదితరులు కూడా ఈ భేటీకి హాజరుకానున్నారు.

Similar News

News December 1, 2025

అయిజ: “Way2News ఎఫెక్ట్” ఎట్టకేలకు నామినేషన్ దాఖలు

image

అయిజ మండలం ఉత్తనూర్ సర్పంచ్ స్థానానికి హాలియా దాసరి జయమ్మ నామినేషన్ వేసే ప్రయత్నం చేయగా అదే సామాజిక వర్గానికి చెందిన వారు బెదిరింపులకు గురి చేశారు. ఈ విషయమై Way2News లో సోమవారం ఉదయం “ఉత్తనూరులో హాలియా దాసర్లకు బెదిరింపులు” శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనానికి మండల అధికారులు స్పందించి గ్రామానికి చేరుకున్నారు. వారిని కలిసి సాయంత్రం నామినేషన్ వేయించారు. వే2న్యూస్‌కు గ్రామస్థులు అభినందించారు.

News December 1, 2025

కాంగ్రెస్‌కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

image

కాంగ్రెస్‌కు ఆ పార్టీ MP శశిథరూర్‌కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్‌‌కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్‌కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్‌లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.

News December 1, 2025

సంస్కరణల ప్రభావం.. నవంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

image

జీఎస్టీ సంస్కరణల ప్రభావం నవంబర్ వసూళ్లపై పడింది. అక్టోబర్‌లో రూ.1.96 లక్షల కోట్లు వసూళ్లవ్వగా నవంబర్‌లో రూ.1.70 లక్షల కోట్లకే పరిమితమైంది. 2024 నవంబర్‌లో రూ.34,141 కోట్లుగా ఉన్న CGST వసూళ్లు ఈ ఏడాది రూ.34,843 కోట్లకు పెరిగాయి. అయితే, SGST వసూళ్లు మాత్రం రూ.43,047 కోట్ల నుంచి రూ.42,522 కోట్లకు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,093 కోట్ల నుంచి రూ.46,934 కోట్లకు పడిపోయాయి.