News March 24, 2025

ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 24, 2026

రథ సప్తమి రోజున ‘7’ అంకె ప్రాముఖ్యత

image

ప్రకృతిలో 7 అంకెకు ఎంతో ప్రాధాన్యముంది. సప్త స్వరాలు, వారాలు, రుషులు, 7 కొండలే కాకుండా సూర్యుడి తొలి 7 కిరణాలు కూడా అంతే ముఖ్యమైనవి. అవి: సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాణ్. ఈ ఏడు కిరణాలు ఏడు రంగులకు (VIBGYOR) మూలమని చెబుతారు. ఇవి విశ్వమంతా శక్తిని, ఆరోగ్యాన్ని నింపుతాయని శాస్త్ర వచనం. సూర్యుని రథానికి ఉండే ఏడు గుర్రాలు కూడా ఈ కిరణాలలోని అద్భుత శక్తికి సంకేతాలే.

News January 24, 2026

600 అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు స్థానిక భాషపై పట్టున్న వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofmaharashtra.bank.in/careers

News January 24, 2026

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

image

AP: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు 2 సెషన్లలో (9.00 AM-12.00PM, 2.00PM-5.00PM) ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్/ ఆధార్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. <>వెబ్‌సైట్‌<<>>లో, మన మిత్ర సర్వీసు(9552300009)లో అందుబాటులో ఉన్నట్లు చెప్పింది.