News February 25, 2025
ఢిల్లీకి సీఎం రేవంత్.. రేపు ప్రధానితో భేటీ

TG: సీఎం రేవంత్ కాసేపటి క్రితం ఢిల్లీకి బయల్దేరారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై విజ్ఞప్తులు చేసే అవకాశముంది. పీఎంతో భేటీ అనంతరం ఆయన కుంభమేళాకు వెళ్లే అవకాశం ఉంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా రేపటితో ముగియనున్న సంగతి తెలిసిందే. కుంభమేళాకు రావాలని యూపీ ప్రభుత్వం గతంలోనే సీఎం రేవంత్ను ఆహ్వానించింది.
Similar News
News February 25, 2025
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

ధవళేశ్వరం కాటన్పేట వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని జాలరిపేటకు చెందిన నాగమల్లి ముత్యాలరావు(18), బొడ్డు వెంకటేశ్(16) మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. మంగళవారం ఆర్టీసీ బస్సు రాజోలు నుంచి రాజమండ్రి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్పై ఓవర్టేక్ చేయబోయి వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 25, 2025
బెయిల్ ఇవ్వాలని కోర్టులో వంశీ పిటిషన్

AP: తనకు బెయిల్ ఇవ్వాలంటూ వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. వంశీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కోర్టు ఆదేశించింది. కౌంటర్ పిటిషన్ వేసేందుకు మూడు రోజుల సమయం కావాలని పీపీ కోరగా, తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.
News February 25, 2025
ఏడాదికి 2 సార్లు టెన్త్ ఎగ్జామ్స్: CBSE

సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్ పరీక్షలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 17-మార్చి 6 మధ్య తొలి దశ, మే 5-20 మధ్య రెండో దశ పరీక్షలు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలకు CBSE ఆమోదం తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.