News March 3, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఆయన సమావేశం కానున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, నిధులపై వారితో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కూడా హస్తినకు వెళ్లనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి రాజస్థాన్ పర్యటనకు వెళ్తున్నారు. ఆ రాష్ట్ర సీఎం భజన్‌లాల్ శర్మతో సింగరేణికి సంబంధించిన ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు.
Similar News
News March 3, 2025
PT వారెంట్ అంటే ఏంటి?

పోసాని, వల్లభనేని వంశీ కోసం ఇవాళ పీటీ వారెంట్లు దాఖలు అయ్యాయి. అసలు ఈ వారెంట్ ఏంటి? ఏ సమయంలో ఉపయోగిస్తారో చూద్దాం. PT వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. ఓ కేసులో అరెస్టై జైలులో ఉన్న వ్యక్తిని మరో కేసులో విచారించడానికి ఇతర ప్రాంతానికి తీసుకెళ్లేందుకు పోలీసులు కోర్టు వద్ద అనుమతి తీసుకోవాలి. ఇలా అనుమతి తీసుకొన్నట్లు జైలు అధికారులకు అందించే పత్రాలను పీటీ వారెంట్ అంటారు.
News March 3, 2025
రష్మిక మందన్నకు బుద్ధి చెప్తాం: కాంగ్రెస్ నేతలు

నటి రష్మిక మందన్నకు బుద్ధి చెప్తామని KA కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆహ్వానించినప్పటికీ కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆమె రాకపోవడమే ఇందుకు కారణం. వివిధ భాషల్లో నటిస్తున్న ఆమె కన్నడను నిర్లక్ష్యం చేస్తున్నారని మండి MLA రవికుమార్ మండిపడ్డారు. తాను హైదరాబాదీనని చెప్పుకోవడమేంటని ప్రశ్నించారు. DyCM డీకే శివకుమార్ చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.
News March 3, 2025
అయోధ్యపై ISI కుట్ర: బాంబుదాడికి సిద్ధపడ్డ టెర్రరిస్టు

అయోధ్య రామమందిరాన్ని పేల్చేసేందుకు ISI భారీ కుట్ర పన్నినట్టు తెలిసింది. ఇందుకోసం ఫైజాబాద్ మటన్ వ్యాపారి, టెర్రరిస్టు అబ్దుల్ రెహ్మాన్‌ను నియమించుకుంది. రెక్కీ నిర్వహించాక ఫైజాబాద్ నుంచి హరియాణాలోని ఫరీదాబాద్‌కు చేరుకున్న రెహ్మాన్‌కు ఓ హ్యాండ్లర్ హ్యాండ్ గ్రెనేడ్లను ఇచ్చాడు. రైల్లో తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా గుజరాత్ ATF, ఫరీదాబాద్ STF టీమ్స్ అతడిని పట్టుకున్నాయి.